![]() |
![]() |

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోలకు తల్లి పాత్రలు వేసే ప్రగతి వయసు తక్కువ ఏమీ కాదు. దగ్గర దగ్గరగా 45 ఏళ్లు ఉంటాయి. ఆంటీ అన్నమాట. అయితే, ఈ వయసులోనూ హాట్ హాట్ స్టెప్పులు వేయడం ఆమెకే చెల్లింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చాలా తనకు నచ్చిన పాటలకు స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించే ప్రగతి ఆంటీ, తాజాగా మరోసారి హాట్ స్టెప్పులు వేసి అలరించారు.
అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా 'బొంబాయి' గుర్తింది కదా! అందులో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన హాట్ సాంగ్ 'హమ్మా హమ్మా'కి అంతే హాట్ హాట్ గా ప్రగతి స్టెప్పులు వేశారు. గతంలో ఒకసారి బెల్లీ డాన్సుతో ఆమె అలరించారు. ఒకసారి లుంగీ కట్టి డాన్సు చేశారు. ఇప్పుడీ బొంబాయి పాటతో మరోసారి ప్రేక్షకులను అలరించారు.

![]() |
![]() |