![]() |
![]() |

పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను తుంగలోకి తొక్కడమే రామ్‌గోపాల్ వర్మ లక్ష్యమని ‘పవర్ స్టార్’ ట్రయిలర్ చూస్తే తెలుస్తుంది. ఛాన్స్ దొరికితే పవన్ ఫ్యాన్స్‌ని కెలకడానికి ప్రయత్నించే వర్మ, ఇప్పుడు ఏకంగా పవన్ మీద సినిమా తీశాడు. ఎన్నికల్లో పవన్ ఓటమిని వెటకారం చేస్తూ ‘పవర్ స్టార్’ తెరకెక్కించాడు. బుధవారం ట్రయిలర్ రిలీజయ్యింది. అందులో మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ భార్య అన్నా లెజినోవా, నిర్మాత బండ్ల గణేష్, ఆఖరికి కత్తి మహేష్‌ను... ఇలా చాలామందిని చూపించాడు. ఒక్క క్యారెక్టర్‌ను మాత్రం సస్పెన్స్‌లో ఉంచాడు.
ట్రయిలర్‌లో 3.36 నిమిషాలకు వోడ్కా బాటిల్ పట్టుకుని ఓ వ్యక్తి పవన్‌కల్యాణ్ దగ్గరకు వస్తాడు. ఆ జీవి ఆర్జీవీ అని తెలిసింది. ‘పవర్ స్టార్’లో తన సొంత క్యారెక్టర్‌ను కూడా వర్మ పెట్టాడు. అయితే, ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుందనేది చూపించలేదు. దాంతో వర్మ క్యారెక్టర్ ఏమై ఉంటుందని ఆసక్తి నెలకొంది. సెటైరికల్ సినిమాలు తీసేటప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్లకు దగ్గర పోలికలతో ఉండే నటీనటులను పట్టుకోవడం వర్మ స్టయిల్. ‘పవర్ స్టార్’ విషయంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు కూడా. అయితే, ట్రయిలర్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
![]() |
![]() |