![]() |
![]() |

"జేజమ్మా.... మాయమ్మా" అంటూ జీరగా కైలాష్ ఖేర్ గొంతులో ఈ పాట వినబడగానే తెలుగు ప్రేక్షకులకు 'అరుంధతి' సినిమా గుర్తుకు వస్తుంది. అరుంధతిగా అనుష్క నటన, ఆ సినిమా తెలుగు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అటువంటిది. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... తెలుగులో విడుదలైన 11 ఏళ్ల తరవాత బాలీవుడ్ లో రీమేక్ కానుంది.
'అరుంధతి' సినిమాను స్వర్గీయ కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఆయన దగ్గర నుండి హిందీ రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ తీసుకున్నారని సమాచారం. మరో నిర్మాత మధు మంతెనతో కలిసి హిందీలో 'అరుంధతి' రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో దర్శకుడిని ఎంపిక చేస్తారట.
తెలుగులో అరుంధతి గా అనుష్క ఇరగదీసింది. హిందీలో ఆ పాత్రకు స్టార్ హీరోయిన్ దీపికా పడుకోనేను సంప్రదించారని సమాచారం. ఇటీవల ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించే సినిమాలో నటించడానికి దీపిక అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా అంగీకరిస్తే తెలుగు నిర్మాతలతో చేస్తున్న రెండో సినిమా అవుతుంది.
![]() |
![]() |