![]() |
![]() |

హిందీలో డార్క్ మోడ్ సినిమాలు వస్తాయి. రామ్ గోపాల్ వర్మ 'సత్య' మొదలుకుని, ఆ సినిమా రచయిత అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' వరకు డార్క్ థీమ్‌లో సినిమాలు వచ్చాయి. తెలుగులో అటువంటి సినిమాలు తక్కువే. 'రక్త చరిత్ర'ను వర్మ డార్క్ థీమ్‌లో తీశారు. తరవాత 'నాటకం' వంటి సినిమాలు వచ్చినా... విజయాలు సాధించలేదు. మరి, 'మేక సూరి' సిరీస్ వెబ్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒరిజినల్ సిరీస్‌లతో తెలుగు ప్రజలను ఆకట్టుకుంటున్న 'జీ5' ఓటీటీ నుండి వస్తున్న కొత్త సిరీస్ 'మేక సూరి'. మాంసం కొట్టే ఓ యువకుడు సూరి, ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సూరి భార్య మీద చాలామంది కన్ను పడుతుంది. చివరకు, ఆ అమ్మాయి హత్యకు గురవుతుంది. తన భార్యను చంపిన వ్యక్తులపై సూరి ఎలా పగ తీర్చుకున్నాడనే కథతో 'మేక సూరి' తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.
నటీనటుల దగ్గర్నుంచి మేకింగ్, టేకింగ్ వరకూ 'మేక సూరి' మరీ నాటుగా ఉంది. తెలుగు నేటివిటీ మిస్ కాకుండా అనురాగ్ కశ్యప్ స్టయిల్ బాగా ఫాలో అయినట్టు ఉన్నారు. నేపథ్య సంగీతంలో 'వదలని పగ...' పాట, యాక్షన్ దృశ్యాలు డార్క్ జానర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. జూలై 31న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
![]() |
![]() |