![]() |
![]() |

‘యు లవ్ హిమ్ ఆర్ యు హేట్ హిమ్. బట్, యు కాంట్ ఇగ్నోర్ హిమ్’ అని ఇంగ్లిష్‌లో ఒక సెంటెన్స్ ఉంది. ‘నువ్వు అతణ్ణి ప్రేమించు లేదా ద్వేషించు. కానీ, అతణ్ణి విస్మరించలేవు’ అని తెలుగులో మీనింగ్. పవర్‌స్టార్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో నూటికి నూరు శాతం అక్షరాల నిజం ఇది. ప్రేక్షకులలో పవన్ అభిమానులు ఉండొచ్చు. పవన్‌ని ద్వేషించే వ్యక్తులు ఉండొచ్చు. కానీ, పవన్‌ని ఎవరూ విస్మరించలేదు. పవన్ అంటే అందరిలో క్రేజ్ ఉంటుంది. అదే రామ్ గోపాల్ వర్మకు డబ్బులు తెచ్చి పెడుతోంది.
పవన్‌కల్యాణ్ అంటే రామ్‌గోపాల్ వర్మకు ఫ్రీ పబ్లిసిటీ మెటీరియల్. ఎప్పుడూ పవన్ కల్యాణ్ జపం చేస్తుంటాడు. పవన్‌ని, పవన్ ఫ్యాన్స్‌ని ఏదో ఒకటి అనకపోతే వర్మకు నిద్రపట్టదేమో. తను అనడమే కాదు, ఇతరులతోనూ పవన్‌ను తిట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా పవన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ‘పవర్ స్టార్’ తీశాడు.
'పవర్ స్టార్' ట్రయిలర్‌కు విడుదలైన తొమ్మిది గంటల్లో 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 73 వేల లైకులు వస్తే, 42 వేల డిస్ లైకులు వచ్చాయి. లైకులు చూసి అదేదో వర్మ గొప్పతనం అనుకుంటే పొరపాటే. అది పవన్ యాంటీ ఫ్యాన్స్ పుణ్యమే. పవన్ అంటే కొందరిలో ఉన్న ద్వేషమే, క్రేజే క్యాష్ రూపంలో వర్మకు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
‘పవర్ స్టార్’ ట్రయిలర్ కొంతమందికి నచ్చి ఉండవచ్చు. కానీ, సగటు ప్రేక్షకుడి దృష్టిలో దర్శకుడిగా వర్మ స్థాయి మరింత అథఃపాతాళానికి పడింది అన్నది అంగీకరించాల్సిన నిజం. బూతు సినిమాలు తీసే స్థాయికి వచ్చిన వర్మను చాలామంది ఇంకా హీనంగా చూడటం మొదలుపెట్టారన్నది విశ్లేషకుల మాట.
![]() |
![]() |