![]() |
![]() |

చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్ త్రిష పేరు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అదీ ఆమె పెళ్లి వార్తలతో. ఎవరితో అనుకుంటున్నారు? తమిళ హీరో శింబు అలియాస్ శిలంబరసన్‌తో. అవును. నయనతార ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ అయిన శింబును త్రిష పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ప్రచారం వైరల్ అవుతోంది. తమిళంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ ఇద్దరూ తెరబయట కూడా జంట కానున్నారనే వార్త వాళ్ల అభిమానులకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్నీ కలిగిస్తోంది.
గౌతమ్ మీనన్ సినిమా విన్నైత్తాండి వరువాయ' (తెలుగులో 'ఏమాయ చేశావే') మూవీలో జెస్సీ, కార్తీక్ పాత్రలతో త్రిష, శింబు ప్రేక్షకులను అమితంగా అలరించారు. కొంత కాలంగా వాళ్లిద్దరూ సన్నిహితంగా మెలగుతూ వస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో నలుగుతూ ఉంది. త్వరలోనే ఆ ఇద్దరు పెళ్లాడాలనే ఆలోచనతో ఉన్నట్లు పలు తమిళ ఆన్‌లైన్ పోర్టల్స్ రాసుకొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై త్రిష కానీ, శింబు కానీ ఇంత దాకా నోరు విప్పలేదు.
మిహీకా బజాజ్‌తో రానా దగ్గుబాటి పెళ్లి నిశ్చయం అయిన దగ్గర్నుంచే త్రిష, శింబు అనుబంధం గురించిన ప్రచారం జరుగుతూ వస్తోంది. గతంలో రానా, త్రిష చాలా సన్నిహితంగా మెలగడం, తెల్లవారుఝామున ఫోన్లలో కబుర్లు చెప్పుకోవడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2015లో నిర్మాత వరుణ్ మణ్యన్‌తో త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే వరుణ్ కండిషన్‌తో త్రిష అతడికి గుడ్‌బై చెప్పేసింది.
ఇక శింబు సంగతి తెలిసిందే. మొదట నయనతారతో, తర్వాత హన్సికతో డేటింగ్ చేసి, పెళ్లి దాకా వ్యవహారం వచ్చాక బ్రేకప్ అయిన చరిత్ర అతడిది. మరిప్పుడు త్రిషతో డేటింగ్ అయినా పెళ్లి దాకా వస్తుందా?
![]() |
![]() |