![]() |
![]() |
.jpg)
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అఫిషియల్ లోగోను నిర్వాహకులు సోమవారం లాంచ్ చేశారు. ఎప్పుడు షో స్టార్ట్ అవుతుందనే విషయం వాళ్లు ప్రకటించకపోయినా సెప్టెంబర్ మొదట్లో మొదలవుతుందని తెలుస్తోంది. కాగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా కొంతమంది పేర్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో తరుణ్ పేరు కూడా ఉంది. అయితే తాను బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొనబోవడం లేదని తరుణ్ స్పష్టం చేశాడు. పైగా ఆ షోపై తనకు ఎలాంటి ఆసక్తీ లేదని కూడా తేల్చేశాడు.
"సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీదా, కొన్ని న్యూస్ పేపర్లలోనూ నేను బిగ్ బాస్‌లో పాల్గొనబోతున్నట్లు చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అబద్ధం. అందులో నేను భాగం కాదనీ, భాగం కావడానికి నాకు ఆసక్తి లేదనీ అందరికీ స్పష్టం చేయదలచుకున్నాను. అవన్నీ కేవలం రూమర్స్. ఫేక్ న్యూస్‌ను నమ్మకండి, వ్యాప్తి చెయ్యకండి" అంటూ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చాడు తరుణ్.
అతను కాకుండా కంటెస్టెంట్లుగా ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతున్నవారిలో యాక్టర్లు రష్మీ గౌతమ్, నందు, శ్రద్ధా దాస్, అఖిల్ సార్థక్, యామినీ భాస్కర్, హంసానందిని, సింగర్స్ సునీత, మంగ్లీ, వైవా హర్ష, యాంకర్స్ రవి, యాంకర్ లాస్య, బిత్తిరి సత్తి ఉన్నారు.

![]() |
![]() |