![]() |
![]() |

కమల్ హాసన్ కూతురు శ్రుతికి సక్సెస్, స్టార్ డమ్ వచ్చినది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే. ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర పడిన ఆమెకు 'గబ్బర్ సింగ్'లో హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా శ్రుతి హాసన్ కెరీర్ ను మలుపు తిప్పింది. అందుకని, బాలీవుడ్ నుండి ఛాన్సులు వచ్చినా... తెలుగు సినిమాను శ్రుతి హాసన్ ఎప్పుడూ తక్కువ చేసి చూడదు.
హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. రీసెంట్గా బాలీవుడ్ మీడియా నుండి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. 'మీరు ఎప్పుడు సౌత్ సినిమాలతో బిజీగా ఉంటారు?' అని. అప్పుడు శ్రుతి హాసన్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
"నేను సౌత్ ఇండియన్. తమిళ అమ్మాయిని. తెలుగు సినిమా నాకు ఎంతో విలువ ఇచ్చింది. నా మాతృభాష తమిళం. అందుకని, సౌత్ సినిమాలను నేను వదులుకోలేను. నాకు బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలూ ముఖ్యమే" అని శ్రుతి హాసన్ చెప్పింది. కొంతమంది హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న తరవాత బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేస్తారు. శ్రుతి హాసన్ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు.
![]() |
![]() |