![]() |
![]() |

నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సురేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. తరవాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా విజయవంతంగా తండ్రి లెగసీని కొనసాగిస్తున్నారు. మరోవైపు అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అరవింద్, మెగా నిర్మాతగా ఎదిగారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరూ ఇద్దరే. కింగ్ పిన్స్ అనవచ్చు. అటువంటి వీళ్లిద్దరి మధ్య శత్రుత్వం ఉందా? లేదని సురేష్ బాబు చెప్పారు.
"ఫస్ట్... అల్లు అరవింద్, నేను శత్రువులం కాదు. ఇన్ ఫ్యాక్ట్... మంచి మిత్రులం. ఎవరి బిజినెస్ వాళ్ళది. మేమిద్దరం వేర్వేరు వ్యక్తులం" అని సురేష్ బాబు స్పష్టం చేశారు. దీనికి కారణం ఏంటంటే... కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ 'ఆహా' ఓటీటీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సురేష్ బాబు కూడా ఒక ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబెర్స్‌తో డిస్కస్ చేస్తున్నారు. అల్లు అరవింద్‌కి పోటీగా స్టార్ట్ చేస్తున్నారా? అని సురేష్ బాబును ప్రశ్నించగా... తాము శత్రువులం కాదనీ, ఎవరి బిజినెస్ వాళ్ళదనీ తెలిపారు.
![]() |
![]() |