![]() |
![]() |

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'బజ్‌రంగీ భాయిజాన్' (2015) విడుదలైన ఐదేళ్ల తర్వాత కూడా జపాన్‌లోని కొన్ని థియేటర్లలో ఇప్పటికీ ఆడుతుండటం విశేషం! ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన డైరెక్టర్ కబీర్ ఖాన్.. ఆ మూవీ విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకోవడాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
"ఒక సినిమా మా హృదయాల నుంచి వచ్చింది.. అది నాకెప్పటికీ ప్రత్యేకమైంది. ఎందుకంటే.. 'బజ్‌రంగీ భాయిజాన్'పై మీరు కురిపించిన ప్రేమ వర్షం అలాంటిది. ఇప్పటికీ దాన్ని మెచ్చుకుంటున్న మీకు థాంక్స్. ఐదేళ్ల తర్వాత జపాన్‌లో కొన్ని థియేటర్లలో అదింకా ఆడుతూనే ఉంది. #5YearsOfBajrangiBhaijaan" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు కబీర్ ఖాన్.
అంతే కాకుండా, ఆ సినిమా సెట్స్ నుంచి తెరవెనుక సీన్లకు సంబంధించిన ఒక వీడియోను కూడా అతను షేర్ చేశాడు. అందులో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీలు నటిస్తున్నప్పటి మూమెంట్స్ ఉన్నాయి. 'బజ్‌రంగీ భాయిజాన్' మూవీ ఇటు ప్రేక్షకాదరణనూ, అటు విమర్శకుల ప్రశంసలనూ అమితంగా పొందింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
![]() |
![]() |