![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్: రౌద్రం రణం రుధిరం' కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. కరోనా గొడవ లేకపోతే 2021 జనవరి 8న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. నాలుగు నెలలుగా షూటింగ్ నిలిచిపోవడంతో దర్శక నిర్మాతల ప్లానింగ్ అంతా తలకిందులయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన కబుర్ల కోసం ఫ్యాన్స్ పడిగాపులు పడుతూ ఎదురు చూస్తున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని క్యారెక్టర్ రామరాజు ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ చేయగా వచ్చిన రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందో చూశాం. అయితే అలాంటి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ తారక్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చెయ్యలేకపోయారు నిర్మాతలు. కారణం.. అప్పటికి దానికి సంబంధించన పనులేవీ చేసే అవకాశం లేకపోవడం.
కాగా.. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్'లో తారక్, చరణ్ చేసిన పాత్రల నిడివి గురించి రైటర్ సాయిమాధవ్ బుర్రా ఇచ్చిన అప్‌డేట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోల క్యారెక్టర్లను రాజమౌళి చాలా బాగా బ్యాలెన్స్ చేశారనీ, ఈ పీరియడ్ డ్రామాలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యం, స్క్రీన్ టైమ్ ఇచ్చారనీ ఆయన స్పష్టం చేశాడు. ప్రేక్షకులు ఊహించిన దానికి మించి 'ఆర్ ఆర్ ఆర్' ఉంటుందనే నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ 70 శాతం షూటింగ్ పూర్తయింది. మరో రెండు నెలల దాకా షూటింగ్‌కు అవకాశం లేకపోవడంతో తను కొత్తగా కట్టించుకున్న ఫామ్‌హౌస్‌కు వెళ్లి గడుపుతున్నాడు రాజమౌళి. అక్కడాయన మహేశ్‌తో తను చేయబోయే తదుపరి సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.
![]() |
![]() |