![]() |
![]() |

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని కాదు, సినిమా షూటింగ్స్‌కీ రాజధాని. బాలీవుడ్ స్టార్ హీరోలు హైదరాబాద్ వచ్చి ఇక్కడి స్టూడియోలలో షూటింగ్స్ చేసుకుని వెళతారు. కానీ, ప్రజెంట్ సిటీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ హైదరాబాద్ షెడ్యూల్ క్యాన్సిల్ చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే...
జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ముంబై సాగా’. లాక్‌డౌన్ తరవాత రామోజీ ఫిల్మ్ సిటీలో 14 రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసి ముంబైలో చేస్తున్నారు. దీనికి కారణం కరోనా కేసులే.
‘ముంబై సాగా’ డైరెక్టర్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ ‘‘మూడు ఇండోర్ సెట్స్‌లో 10 రోజులు, అవుట్ డోర్ నాలుగు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేశాం. కానీ, రిస్క్ అని క్యాన్సిల్ చేశాం. ముంబైలా ఇప్పుడు హైదరాబాద్ కూడా సేఫ్ కాదు. అందుకని, అక్కడికి వెళ్లడం కన్నా ముంబైలో చేయడమే బెటర్ అని డెసిషన్ తీసుకున్నాం. నిజానికి... హైదరాబాద్‌లో షూటింగ్ చేయడానికి హీరోలు రెడీ. కానీ, వాళ్ళ హెల్త్ రిస్క్‌లో పెడుతూ చేయకూడదని మానేశా’’ అని అన్నారు.
![]() |
![]() |