![]() |
![]() |

స్టార్ మా ఛానల్‌లో త్వరలో మొదలు కానున్న 'బిగ్ బాస్' రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ కోసం సెలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్ 19 నేపథ్యంలో షోకి మరింత క్రేజ్ తీసుకు రావడానికి స్టార్ స్టేటస్ ఉన్న నటీనటులు, క్రేజీ యంగ్ హీరోల కోసం స్టార్ మా యాజమాన్యం గట్టిగా ప్రయత్నిస్తోంది.
'ఆర్ఎక్స్ 100'తో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ, 'గుంటూరు టాకీస్', 'కృష్ణ అండ్ హిజ్ లీల' ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డను స్టార్ మా ఛానల్ 'బిగ్ బాస్' కోసం అప్రోచ్ అయ్యిందట. అయితే, ఇద్దరూ ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారని టాక్. ఇద్దరూ కొత్త సినిమాలు స్టార్ట్ అయితే షెడ్యూల్స్ క్లాష్ అవుతాయని, అందువల్ల చేయలేమని చెప్పారట.
రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మ బోల్డ్ మూవీ 'నగ్నం'తో లైమ్ లైట్‌లోకి వచ్చిన శ్రీ రాపాకను 'బిగ్ బాస్' హౌస్ నిర్వాహకులు సంప్రదించగా రోజుకి లక్ష రూపాయలు డిమాండ్ చేసిందట. దాంతో లైట్ తీసుకున్నారట. మూడో సీజన్‌కు హోస్ట్‌గా చేసిన నాగార్జున ఈ సీజన్‌కీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
![]() |
![]() |