![]() |
![]() |

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్‌ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా 'కాక్క కాక్క'. దాన్నే తరవాత తెలుగులో వెంకటేష్ హీరోగా 'ఘర్షణ'గా గౌతమ్ మీనన్ రీమేక్ చేశాడు. తరవాత 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా కోసం కొని ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు.
విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ తీస్తున్న 'ధ్రువ నక్షత్రం' సినిమాను మొదట సూర్యతో తీయాలని గౌతమ్ మీనన్ ప్రయత్నించాడు. కానీ, ఏవో మనస్పర్థలు వచ్చి హీరోని మార్చేశాడు. మళ్లీ ఇప్పుడు సూర్యతో మరో సినిమా కోసం డిస్కషన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి తమ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ కాలేదని, త్వరలో కన్ఫర్మ్ చేస్తానని గౌతమ్ మీనన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయని అన్నాడు.
'ఏ మాయ చేశావే' సీక్వెల్ స్క్రిప్ట్ కూడా రాస్తున్నానని గౌతమ్ మీనన్ స్పష్టం చేశాడు. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా నటించగా... అదే కథను తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయా' పేరుతో తీశాడు. లాక్ డౌన్ లో శింబు, త్రిషపై తెరకెక్కించిన 'కార్తీక్ డయల్ సేయతా ఎన్' సీక్వెల్ కథలో ఓ సన్నివేశమని గౌతమ్ మీనన్ తెలిపాడు.
![]() |
![]() |