![]() |
![]() |

ఒక్క జయా బచ్చన్ మినహా బచ్చన్ కుటుంబం మొత్తం ఇప్పుడు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఉంది. బిగ్ బి అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత వారం ఆస్పత్రిలో చేరారు. దాంతో బచ్చన్ కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య సైతం ఈ నెల 12న కరోనా పాజిటివ్‌గా తేలారు. అయితే, ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో హోమ్ ఐసొలేషన్ లో ఉంచారు. తాజాగా వాళ్ళిద్దరిలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.
ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్య ఆస్పత్రిలో చేరిన విషయాన్ని నానావతి హాస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి. అమితాబ్, అభిషేక్ కూడా అదే ఆస్పత్రిలో ఉన్నారు. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బచ్చన్ కుటుంబానికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు సమాచారం, మరోవైపు తమ కోసం ప్రార్ధించిన ప్రజలకు అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |