![]() |
![]() |

రచయితగా కెరీర్‌ను ఆరంభించి ఆపై 'మిర్చి'తో దర్శకుడిగా అవతారమెత్తాడు కొరటాల శివ. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ.. ఆ తరువాత కూడా ఆ విజయపరంపరని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు.. స్టార్ హీరోలతోనే వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే ఆయా కథానాయకులకు తన చిత్రాలతో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్స్‌ను అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
కొరటాల తొలి చిత్రం ‘మిర్చి’ విషయానికొస్తే.. ఆ చిత్ర కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి అప్పట్లో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందా సినిమా. ఇక శివ సెకండ్ ఫిలిమ్ ‘శ్రీమంతుడు’ది కూడా అదే బాట. సూపర్ స్టార్ మహేశ్ బాబు గత చిత్రాల రికార్డులను తిరగరాస్తూ అతని కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నమోదయింది. అలాగే, కొరటాల థర్డ్ మూవీ ‘జనతా గ్యారేజ్’.. ఆ సినిమా హీరో యంగ్ టైగర్ యన్టీఆర్‌కి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌ని అందించింది. ఇక శివ నాలుగో చిత్రమైన ‘భరత్ అనే నేను’ సంగతి తీసుకుంటే.. ‘శ్రీమంతుడు’ కంటే మిన్నగా వసూళ్లను రాబట్టి మహేశ్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్ అయింది. ఇలా.. కొరటాల డైరెక్ట్ చేసిన మొదటి నాలుగు సినిమాలు కూడా ఆయా కథానాయకులకు అప్పట్లో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్స్ కావడం విశేషం.
ఈ నేపథ్యంలోనే.. తన తాజా చిత్రం ‘ఆచార్య’కి కూడా కొరటాల శివ ఈ పరంపరను కొనసాగిస్తాడో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ సినిమా కోసమే తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో చరణ్‌ది కీలక పాత్ర కాగా.. చిరు కథానాయకుడిగా సందడి చేయనున్నారు. మరి.. ప్రభాస్, మహేశ్, తారక్‌కి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్స్‌ని అందించిన కొరటాల శివ.. చిరుతో కూడా ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |