![]() |
![]() |

యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ ఇండియా 'ఆర్ఆర్ఆర్'లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా తీస్తున్న ఈ కల్పిత కథా చిత్రంలో ఆ పాత్రల్ని రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి భయాందోళనలతో సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో, 2021 జనవరి 8న 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేద్దామనుకున్న దర్శక నిర్మాతల ప్లాన్స్ తలకిందులయ్యాయి. లాక్‌డౌన్ ముగిసి, రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీ షూటింగ్‌ను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్‌గా ఒక తెలుగు టీవీ నటుడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో పునఃప్రారంభించిన టీవీ షూటింగ్‌లను మళ్లీ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో సినిమాల షూటింగ్‌లను రెజ్యూమ్ చేయడం వెనక్కి జరిగినట్లు సమాచారం.
కాగా, 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవ్‌గణ్ ఒక జాతీయవాది పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. ఆ కాలానికి పేరుపొందిన జాతీయవాదులు కొందరున్నారు. వారిలో ఎవరి పాత్రను దేవ్‌గణ్ చేస్తున్నాడనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. అంతే కాకుండా, తారక్, చరణ్‌లకు గురువుగా కూడా ఆయన కనిపించనున్నాడు. ఆయనది పూర్తి స్థాయి పాత్ర కాదు. సినిమా అంతటా కనిపించడు. ఒక ఎపిసోడ్‌లోనే ఆయన పాత్ర వస్తుందనేది ఇన్‌సైడర్స్ మాట. ఆయనకు సంబంధించిన సన్నివేశాల్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన స్పెషల్ సెట్‌లో 10 రోజుల పాటు చిత్రీకరించారు. నిడివి రీత్యా తనది చిన్న పాత్రే అయినప్పటికీ అది తనకు తృప్తినిచ్చిందని ఆయన అంటున్నాడు. 'ఆర్ఆర్ఆర్' రిలీజైతేనే కానీ, ఆయన రోల్‌లోని స్పెషాలిటీ ఏమిటనేది తెలీదు.
![]() |
![]() |