![]() |
![]() |

మలయాళంలో మంచి మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తుంటాయి. పాయింట్ చిన్నదైనా... మంచి కథగా మలిచి, ప్రేక్షకులను రెండు మూడు గంటలు థియేటర్లలో కూర్చోబెట్టేలా సినిమాలు తీస్తారు. 'సూఫీయుమ్ సుజాతయుమ్' ట్రైలర్ చూస్తే... వెబ్ సిరీస్‌ల విషయంలోనూ మలయాళ చిత్ర పరిశ్రమ అదే బాటలో నడుస్తున్నట్టు ఉంది. డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్ కంటెంట్ అంటే అడల్ట్ సీన్లు లేదంటే మోడ్రన్ కథల పేరుతో బోల్డ్ డైలాగులతో తీయడమే అన్నట్టు ఎడాపెడా వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకులకు మీదకు వదులుతున్న ఈ రోజుల్లో హార్ట్ ఫుల్ సినిమాగా 'సూఫీయుమ్ సుజాతయుమ్' ట్రైలర్ మంచి సినిమాలు కోరుకొనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
లవ్ జిహాదీ... కొన్నాళ్ల క్రితం ఉత్తరాదిలో ఈ పదం బాగా వినిపించింది. హిందూ అమ్మాయిలకు ప్రేమ పేరుతో ముస్లిమ్ యువకులు వల వేసి, మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆర్ఎస్ఎస్ సహా హిందుత్వ వాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లవ్ జిహాదీ కాన్సెప్ట్ తీసుకొని మంచి ప్రేమకథగా 'సూఫీయుమ్ సుజాతయుమ్' తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అందులోనూ అదితిరావు హైదరి హిందూ అమ్మాయిగా, మూగ పాత్రలో అద్భుత అభినయం కనబరిచింది. మలయాళంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జూలై 3న ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అమెజాంట్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
![]() |
![]() |