![]() |
![]() |

యశ్ హీరోగా నటించగా బ్లాక్‌బస్టర్ హిట్టయిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' మూవీ తెలుగు వెర్షన్ త్వరలో బుల్లితెరపై వీక్షకులను అలరించడానికి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, జూలై మొదటి వారంలో 'కేజీఎఫ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ రానున్నది. ఆ మూవీని ప్రసారం చేయబోతున్న స్టార్ మా చానల్ రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌లో కుతూహలాన్ని కలిగించింది. ఈ న్యూస్‌ను వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కన్నడ స్టార్ యాక్టర్ యశ్‌ను సూపర్ స్టార్‌గా మార్చడమే కాకుండా, అతడికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. అంతే కాదు, నార్త్ ఇండియాలో కన్నడ సినిమాల మార్కెట్ రేంజ్‌ను పెంచింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' కోసం అందరూ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో డైలీ సీరియల్స్ ప్రసారం కూడా ఆగిపోయింది. టీవీ రేటింగ్స్‌ను నిలబెట్టుకోవడం కోసం చానళ్లు పాత రియాలిటీ షోలు, డాన్స్ షోలు, సాంగ్స్ ప్రోగ్రామ్స్, సక్సెస్‌ఫుల్ ఫిలిమ్స్‌ను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు స్ట్రయిట్, డబ్బింగ్ సినిమాలు ప్రసారానికై లైన్‌లో ఉన్నాయి.
ఇటీవల టీవీ షూటింగ్‌లు మొదలైనా, లేటెస్ట్‌గా ఒక టీవీ నటుడు కోవిడ్ 19 బారిన పడ్డాడనే విషయం వెల్లడవడంతో, మళ్లీ ఆగిపోయాయి. కరోనా వ్యాప్తి భయంతో షూటింగ్‌లను నిలిపి వేయాల్సిందిగా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (ఏఏటీటీ) ఆదేశించింది.
![]() |
![]() |