![]() |
![]() |

టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్‌కి కరోనా వచ్చింది. అయితే, బుల్లితెర మెగాస్టార్‌గా పేరొందిన 'ఈటీవీ' (ఇప్పుడు ఈటీవీలో లేరు. జీ తెలుగులో సీరియల్స్ చేస్తున్నారు. మధ్యలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు) ప్రభాకర్‌కి కరోనా వచ్చిందని అనుకున్నారంతా. ఈ విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్ నెలకొంది. దాంతో ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రభాకర్ వివరణ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తెలిపారు. ఎవరి వచ్చినా కరోనా కరోనాయే. దానికి తోడు టీవీ సీరియల్ షూటింగుకు వచ్చినప్పుడు సెట్ లో టెస్టులు చేయగా, కరోనా ఉందని తేలడంతో యూనిట్ మొత్తానికి కంగారు పట్టుకుంది. అందరినీ క్వారంటైన్ చేశారు.
ప్రభుత్వం టీవీ, సినిమా షూటింగులకు అనుమతులు ఇచ్చిన తరవాత పెద్ద ఎత్తున టీవీ షూటింగులు స్టార్ట్ అయ్యాయి. ఏవో నాలుగైదు సినిమాలు మాత్రమే సెట్స్ కి వెళ్లాయి. ఇప్పుడు టీవీ నటుడికి కరోనా అని తేలడంతో బుధవారం తాత్కాలికంగా షూటింగులకు బ్రేక్ వేశారు. టీవీ నిర్మాతలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని టీవీ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ భావిస్తోంది. టీవీ సీరియల్స్ నిర్మాతలు, టీవీ యాజమాన్యాలు సైతం ఈ రోజు సమావేశం అవుతున్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? అని సమాలోచనలు చేయనున్నారు.
![]() |
![]() |