![]() |
![]() |

మహేష్‌బాబుకు జంటగా 'అతిథి'లో నటించిన "అమృతా రావుకు అంత పెద్ద అపార్ట్‌మెంట్ వుందా?" అని కొంతమంది ఆశ్చర్యపోతుంటే... ఆమె మంచి మనసును మరికొంతమంది మెచ్చుకుంటున్నారు. ఇంతకీ, అసలు అమృతా రావు ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే...
హీరోయిన్‌గా నటించడం ద్వారా సంపాదించిన డబ్బును చాలా తెలివిగా రియల్ ఎస్టేట్‌లో, ప్రాపర్టీల మీద అమృతా రావు ఇన్వెస్ట్ చేసింది. ముంబైలో ఆమెకు అపార్ట్‌మెంట్ వుంది. అందులో అద్దెకు ఉంటున్న జనాలు, లాక్‌డౌన్ టైమ్‌లో సొంతూళ్లకు వెళ్లారు. మళ్లీ ముంబై వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. పనులు కూడా లేవు. దాంతో మార్చి నుండి జూలై వరకూ ఐదు నెలల అద్దెను వదులుకోవడానికి అమృతా రావు సిద్ధపడింది.
"మా అపార్ట్‌మెంట్‌లో యాక్టింగ్, సినిమాటోగ్రఫీ ప్రొఫెషనల్స్ అద్దెకు ఉంటున్నారు. వాళ్లకు నెలకు ఇంత జీతం అని గ్యారెంటీ ఉండదు. అందుకని నేను చేయగలిగిన సహాయం చేస్తున్నా. ఎక్కడైనా అద్దెకు ఉంటున్న వాళ్లలో ఉద్యోగాలు చేస్తున్నవారు, దీన్ని అవకాశంగా తీసుకుని అద్దె ఎగొట్టడానికి ప్రయత్నించి ఓనర్లను ఇబ్బందులు పెట్టకూడదని కోరుతున్నా" అని అమృతా రావు అన్నారు.
![]() |
![]() |