![]() |
![]() |

బాలీవుడ్‌లో యంగ్ హీరో సుశాంత్ సూసైడ్ కేసు సెగలు రేపుతోంది. నెపోటిజమ్ కారణంగా అవకాశాలు కోల్పోయి, మానసిక ఒత్తిడికి లోనయి సూసైడ్ చేసుకున్నాడనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇండియాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో సుశాంత్ సూసైడ్ హాట్ టాపిక్. కాంట్రవర్సీగా మారింది. అటు సౌత్ కొరియాలోనూ ఓ పాప్ సింగర్ మరణం చుట్టూ కాంట్రవర్సీ నెలకొంది.
సౌత్ కొరియా మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో యంగ్ పాప్ సన్సేషన్ యోహాన్ ఈ నెల 16న మరణించాడు. అయితే, అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దాంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి మీడియాలో వివిధ కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. 28 ఏళ్లకు ఎలా మరణించాడనేది మిస్టరీగా మారింది.
యోహాన్ ఒరిజినల్ పేరు కిమ్ జోహెంగ్ హువాన్. బాయ్ బ్యాండ్ ‘నోమ్’తో ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2017లో ‘టి.ఎస్.టి’ (టాప్ స్ట్రీట్) బ్యాండ్‌లో చేరాడు. జనవరిలో ఈ బ్యాండ్ నుండి ‘కౌంట్ డౌన్’ ఆల్బమ్ రిలీజైంది. యోహాన్ డెత్ మిస్టరీగా మారడం, డిఫరెంట్ స్టోరీలు వస్తుండటంతో సంయమనం పాటించమని మీడియాను యోహాన్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది.
![]() |
![]() |