![]() |
![]() |

‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘సాహో’తోనూ ఆ పరంపరను కొనసాగించాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ప్రభాస్ 20’ది కూడా సేమ్ పాత్. అయితే ఆ తరువాత రాబోయే చిత్రం మాత్రం.. నెక్స్ట్ లెవెల్. ఈ సారి పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ మూవీతో వరల్డ్ వైడ్‌గా హల్‌చల్ చేయబోతున్నాడు ఈ ‘డార్లింగ్’ స్టార్.
‘మహానటి’తో స్టార్ డైరెక్టర్స్ లీగ్‌లో చేరిపోయిన నాగ్ అశ్విన్ రూపొందించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో.. ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో దర్శనమివ్వనున్నాడు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఇందులో భాగంగానే.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట నాగ్ అశ్విన్. అంతేకాదు.. వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రధాన దేశాలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని.. అలాగే ఇంగ్లీష్ వెర్షన్‌లోనూ ‘ప్రభాస్ 21’ని రిలీజ్ చేయడానికి భారీ స్కెచ్ జరుగుతోందని ఇన్‌సైడ్ సోర్స్.
మరి.. ఆంగ్ల పలుకులతో ప్రభాస్ చేయబోయే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే.. 2022 వేసవి వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ‘ప్రభాస్ 21’లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చిత్రాల్లో నాయికగా నటించిన దీపికా పడుకోనే హీరోయిన్‌గా ఎంపికైందని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ విషయంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |