![]() |
![]() |

తెలుగు ప్రజలకు 'అన్నగారు' అనే పిలుపు వినబడితే తెలుగుజాతికి కీర్తి ప్రతిష్ఠలను దశదిశలా చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుగారి పేరు ముందుగా గుర్తొస్తుంది. అచ్చంగా ఆయన రూపురేఖలతో జన్మించిన మనవడు జూనియర్ ఎన్టీఆర్. లాక్‌డౌన్‌లో ఆ ఎన్టీఆర్ సినిమాలను ఈ ఎన్టీఆర్ చూస్తున్నారు. అదేనండీ... అన్నగారి సినిమాలను ఆయన మనవడు ఎన్టీఆర్ చూస్తున్నారు.
ఆణిముత్యాలు అనదగ్గ సినిమాలు ఎన్నో అన్నగారు చేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు కలకాలం నిలిచిపోయే క్లాసిక్ సినిమాలు ఇచ్చారు. లాక్‌డౌన్‌లో పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్... ఇద్దరితో కలిసి అన్నగారి సినిమాలను జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నారు. అలాగే, కిచెన్ లోకి వెళ్లి కొత్త వంటలు కూడా ట్రై చేస్తున్నారట. బిర్యానీ గట్రా చేయడంలో ఎన్టీఆర్ స్పెషలిస్ట్. సినిమాల నుండి విరామం దొరకడంతో వంట చేయడంతో పాటు పిల్లలకు నేర్పుతున్నారట.
![]() |
![]() |