![]() |
![]() |

జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందడం సినిమా ప్రపంచాన్నంతా షాక్‌కు గురిచేసింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న అతను ఆరు నెలలుగా చికిత్స తీసుకుంటూ వచ్చాడు. అతని మరణం తర్వాత బాలీవుడ్ లోపలి వ్యక్తులు, బయటి వ్యక్తుల మధ్య ఆన్‌లైన్‌లో బహిరంగంగా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బాలీవుడ్‌ను తమ కనుసన్నల్లో ఉంచుకుంటూ వస్తోన్న మాఫియా వల్లే అతను డిప్రెషన్‌కు గురయ్యాడనీ, అతని చావుకు ఆ మాఫియాదే బాధ్యత అంటూ చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. సుశాంత్‌సింగ్ ఆత్మహత్యకు దారి తీసిన అంశాలపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అతను చనిపోయిన సమయంలో ఉన్న అతని నౌకర్లు, వంటవాళ్లు, స్నేహితుల స్టేట్‌మెంట్లను పోలీసులు ఇప్పటికే రికార్డు చేసుకున్నారు. సుశాంత్ తండ్రి కూడా తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తనకు తెలీదని ఆయన తెలపడం గమనార్హం.
ఆదివారం సుశాంత్ మరణించిన తర్వాత అతను వాడుతున్న మెడిసిన్లు, వాటికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లను పోలీసులు గుర్తించారు. ఎప్పుడైనా ఆత్మన్యూనతతో సుశాంత్ మాట్లాడినట్లు తెలుసా అని పోలీసులు ప్రశ్నించినప్పుడు, అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తనకు తెలీదని పోలీసులకు అతని తండ్రి వెల్లడించారు. సుశాంత్ ఎందుకు డిప్రెషన్‌కు గురయ్యాడో తమకు తెలీదని, ఎవరిపైనా తమకు అనుమానాలు లేవనీ సుశాంత్ కుటుంబం తెలిపిందని ఒక సీనియర్ ముంబై పోలీస్ ఆఫీసర్ చెప్పారు.
![]() |
![]() |