![]() |
![]() |

కరోనా కారణంగా ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిత్ర పరిశ్రమ బతికి బాగుపడాలంటే సినిమా నిర్మాణ వ్యయాలు తగ్గాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం నిర్మాతలలో వ్యక్తమవుతోంది. హీరోలు, హీరోయిన్లు సహా ప్రతి ఒక్కరూ పారితోషకం తగ్గించుకోవాలనే మాట కూడా వినపడుతోంది. ఆల్రెడీ కొందరు దర్శకులు హీరోయిన్లు పారితోషికం తగ్గించుకుంటామని చెప్పారు. ఆ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరారు.
"ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలో మెలగాల్సిన సమయం ఇది. క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి, నిర్మాతలకు సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలి. భవిష్యత్తులో నేను చేయబోయే సినిమాలకు 20 నుండి 30 శాతం పారితోషకం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను" అని కీర్తి సురేష్ తెలిపారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 19న కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' విడుదలవుతోంది. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే', ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా 'మిస్ ఇండియా', నగేష్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' సినిమాలు చేస్తున్నారు.
![]() |
![]() |