![]() |
![]() |

బాబాయ్ నందమూరి బాలకృష్ణకు అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు (జూన్ 10) బాలయ్య జన్మదినం.. మామూలు జన్మదినం కాదు, 60వ జన్మదినం. ఈ సందర్భంగా కేవలం తెలుగు రాష్ట్రాలలోని వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు అనేకమంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే రీతిలో తారక్ సైతం సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బాబాయ్‌కి విషెస్ తెలిపాడు.
"నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK" అంటూ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశాడు తారక్. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది నిమిషాల వ్యవధిలోనే దీనికి వేలాది లైక్స్, రిట్వీట్స్ వచ్చాయి.
ప్రస్తుతం బాలయ్య 106వ సినిమా చేస్తుంటే, తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకూ భారీ క్రేజ్ ఉంది.

![]() |
![]() |