![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషించిన మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 8 న థియేటర్స్ లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. అల్లు అరవింద్, వరుణ్ తేజ్ తో మూవీ టీమ్ హాజరైన ఈ వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
"గని ఇంక లైఫ్ లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చెయ్" అంటూ నదియా చెప్పే డైలాగ్ తో గని ట్రైలర్ ప్రారంభమైంది. తన తల్లికి తెలియకుండా బాక్సింగ్ ఆడుతూ, ఒకవేళ తెలిసినా నేషనల్ ఛాంపియన్ అయ్యాకే తెలియాలి అనుకునే గని క్యారెక్టర్ లో వరుణ్ కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తో లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. తనకి ఎదురైన అడ్డంకులను తొలగించుకుంటూ, బాక్సర్ అవ్వడానికి గని పడే తపన ట్రైలర్ లో కనిపిస్తోంది. "మంచోడిని గెలుకు, చెడ్డోడిని గెలుకు.. కానీ ఆటని బతికించాలనుకునే నా లాంటి పిచ్చొడిని గెలకకు" అంటూ వరుణ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది.

ట్రైలర్ లో వరుణ్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిక్స్ ప్యాక్ బాడీతో రియల్ స్పోర్ట్స్ పర్సన్ లా కనిపించాడు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. పలు భాషల స్టార్స్ నటించిన ఈ సినిమా ట్రైలర్ కి పాన్ ఇండియా కళ కలినిపిస్తోంది. తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సత్తా చాటబోతున్నాడని ట్రైలర్ తో చెప్పేశాడు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |