![]() |
![]() |

ఓ వైపు హిందీ సినిమా 'ద కశ్మీర్ ఫైల్స్' రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తుంటే, మరో వైపు పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' మాత్రం దారుణ కలెక్షన్స్ తో డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ రెండు సినిమాలు ఒకేరోజు మార్చి 11 న విడుదలయ్యాయి. మొదటి రోజు ఓవరాల్ గా 3.55 గా కోట్ల నెట్ కలెక్ట్ చేసిన 'ద కశ్మీర్ ఫైల్స్' ఆరో రోజు ఏకంగా 19.05 కోట్లు రాబట్టడం విశేషం. 'రాధేశ్యామ్' పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 25.49 కోట్ల షేర్ రాబట్టిన 'రాధేశ్యామ్' ఆరో రోజు 63 లక్షలకు పడిపోయింది.
204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాధేశ్యామ్ ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 78.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. ఆరు రోజుల్లో 52.27 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో 11.10 కోట్లు రాబట్టిన రాధేశ్యామ్.. హిందీలో 8.40 కోట్లు కలెక్ట్ చేసింది. రెస్టాఫ్ ఇండియా 6.63 కోట్లు వసూలు చేసింది. రాధేశ్యామ్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఓవరాల్ గా ఇంకా 125.60 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే రాధేశ్యామ్ భారీ నష్టాలు చూసే అవకాశముంది. ఓ వైపు 'ద కశ్మీర్ ఫైల్స్' నార్త్ తో పాటు హైదరాబాద్ లోనూ మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. చిన్న సినిమాగా వచ్చి ఆరు రోజుల్లో ఈ మూవీ దాదాపు 80 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ లో మరిన్ని అద్భుతాలు చేసే అవకాశముంది. ఇక దానికి తోడు మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదల ఉండటంతో.. మార్చి 24 నాటికి రాధేశ్యామ్ ఫుల్ రన్ దాదాపు పుర్తయినట్లే. అంటే నష్టాలను కొంతమేర తగ్గించుకోవడానికి ఈ వీకెండ్ లో రాధేశ్యామ్ సత్తా చాటాల్సి ఉంది.
![]() |
![]() |