Home  »  News  »  బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 4 గోరుముద్దలతో గోలగోల

Updated : Sep 10, 2020

నైబర్ హౌస్ లో ఉన్న వారి ఎంట్రీ
కన్నీళ్లు పెట్టుకున్న అఖిల్, కళ్యాణి
వర్క్ అవుట్స్, ప్లయింగ్ కిస్ లతో అదరగొట్టిన గంగవ్వ

టెలివిజన్ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తూ వినోదాన్ని పంచే రియాల్టీషో బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్ 4 బుధవారం ప్రసారం అయ్యింది. బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి సీక్రెట్ రూమ్ కే పరిమితం అయిన అరియానా గ్లోరి,  సయ్యద్ సోహైల్ లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆట మొదలయింది. సొహైల్ పరిచయాలు చేసుకుంటుండగా.. అరియానా అతని మాటలకు అడ్డు పడుతూ  పరిచయాలు తరువాత.. ముందు మనం వచ్చిన పని చూద్దాం అంటూ  పరిచయాల కార్యక్రమానికి బ్రేక్ వేసింది. అందరూ రండి అనడంతో గంగవ్వ తప్ప మిగతా కంటెస్టెంట్లు వచ్చి కూర్చోన్నారు. వారికి ఎదురుగా సోహైల్, అరియానా కూర్చుంటూ  'నోయల్ నువ్ ఎందుకు ఫోన్ కట్ చేశావ్'.. అని నిలదీసింది అరియానా. 'మీరు ఫోన్ కట్ చేయడం వల్ల మాకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అందలేదు. ఫోన్లో నేను మాట్లాడుతుండగానే ఎలా కట్ చేస్తావు' అంటూ సోహైల్  ప్రశ్నించారు. అరియానా, సోహైల్, నోయల్ మధ్య కాసేపు వాదన జరిగింది. అరియానా చెప్పిందంతా విన్న తర్వాత  నోయల్ సమాధానం ఇస్తూ 'మీ వయసు ఎంత అని ఇద్దరిని కనుక్కొని, ఈ వయసులో టైం తినకపోతే పెద్దగా ఏమి కాదు' అన్నాడు. దాంతో మరోసారి సోహైల్,  నోయల్ మధ్య వాదన జరిగింది.  'బిగ్ బాస్ హౌస్‌లో నేను బిగ్ బాస్ అని చెప్పి పనులు చేయించువద్దు. అది మీ  తప్పు. నిన్న ఫుడ్ వచ్చింది కాబట్టి బయటకు రాలేదు.. ఈరోజు ఫుడ్ రాలేదు. అందుకే బయటకు వచ్చారు' అంటూ నోయల్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశాడు. ' మీకు తెలుసా గంగవ్వకు పొద్దున లేవగానే టీ తాగాలి... కానీ టైం కు ఇవ్వలేదు' అన్నాడు నోయల్ మధ్యలో లాస్య కల్పించుకొని 'మీరు  250 గ్రామ్స్ షుగర్ కావాలి అని అడిగారు. మేము ఇచ్చాము..మీకు ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవాలి మిగతాది తిరిగి ఇచ్చేయాలి కదా.. మొత్తం షుగర్ మీతోనే ఉంచుకోవడంతో గంగవ్వ కు టీ లేదు'. 'మాకెవ్వరికీ కాఫీలు లేవు' అంటూ కరాటే కళ్యాణి వంతు పాడింది. 'మీ గురించి ఆలోచించకుంటే మీకు రెండు రోజులు ఫుడ్ అందేదే కాదు' అంటూ నోయల్  కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అభిజిత్  మధ్యలో ఎంటర్ అయి 'మీరు మాతో కలిసిపోవాలి అంటే మాత్రం ఇలా రేజ్ చేసి అడిగితే బాగుండదు...నువ్వు అడగడం లేదు అరుస్తున్నావు'  అంటూ సోహైల్ తో గొడవ పెట్టుకున్నాడు.   'అందరం హౌస్ లో ఉండాల్సిన వాళ్ళం. మీ లొల్లి ఏంటీ' అంటూ సొహైల్‌పై ఫైర్ అయ్యాడు.

నైబర్ హౌస్ లో నుంచి వచ్చిన సోహైల్, అరియానా ఒక జట్టుగా, హౌస్ లోని మిగతా సభ్యులంతా మరో జట్టుగా మారి వాదోపవాదాలతో హౌస్‌ని రణరంగంగా మార్చేశారు. ఎవరి ధోరణిలో వారు తమ ఫుల్ జోష్ చూపించారు. ఇదంతా టాస్క్ లో భాగమే అనుకుంటూ చివరికి గొడవ సద్దుమణిగింది. ఒకవైపు సభ్యుల మధ్య వాదన జరుగుతుంటే అదే సమయంలోనే అరియానా వచ్చి నాకు ఆకలిగా ఉంది అనడంతో నైబర్ హౌస్ నుంచి వచ్చిన సోహైల్ కు, అరియానాకు భోజనం పెట్టారు. అయితే అరియానా తనకు 'ఎవరైనా తినిపించాలి, నా మొహంలో నవ్వు చూడాలి' అంటూ మారాం చేయడంతో సభలో మారో  ట్విస్టు. అరియానా మాటలతో సభ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.  నోయల్ అరియానా మాటలను గట్టిగానే అడ్డుకున్నారు.  అయినా తనకు తినిపించాల్సిందే అంటూ మారాం చేయడంతో అఖిల్ సార్థక్ ఆమెకు తినిపించడానికి సిద్దపడగా.. నోయల్ 'బామ్మకు ఎప్పుడైనా తినిపించవా.? ఈమెకు ఎందుకు తినిపిస్తున్నావు' అంటూ అడ్డు తగిలాడు. 'మధ్యలో బామ్మను ఎందుకు తీసుకొస్తున్నావు ఇప్పుడు సమస్య బామ్మది కాదు కదా 'అంటూ అఖిల్ ఎమోషనలై ఒక్కసారిగా ఎడవడంతో గ్రూప్ సభ్యులంతా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

'వాళ్ళ ఆడే టాస్క్ లో మన గ్రూప్ సభ్యులు ఇరుక్కోకూడదు' అంటూ నోయెల్, అఖిల్ చేతిలో ప్లేట్ లాక్కొని ' మా ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద తింటారు. నువ్వు వెళ్లి  అక్కడే తిను' అంటూ అరియానాకు చెప్పాడు.  చివరికి కరాటే కళ్యాణి నేను తినిపిస్తా అంటూ అరియానాకు గోరు ముద్దలు తినిపించింది.  ఆకలి బాధ నాకు తెలుసు అంటూ తన గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలు పెట్టగానే అక్కడే కూర్చోని ఉన్న యాంకర్ దేవి లేచి వెళ్ళిపోయింది.  అభిజిత్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో  ‘ఫాలో... ఫాలో..’ అంటూ వారిద్దరినీ తనదైనా శైలిలో హేళన చేసింది కళ్యాణీ. దాంతో బిగ్ బాస్ హౌస్ లో గోరుముద్దల సన్నివేశం మరో పెద్ద గోలకు, సభ్యుల మధ్య చర్చలకు దారితీసింది. మావవత్వంతో తాను చేసిన పనిని విమర్శించారు, తనను అపార్థం చేసుకున్నారు అంటూ అఖిల్ ఇతర సభ్యులతో కన్నీళ్లు పెట్టుకోగా వాళ్లు అతనిని ఓదార్చారు. ’ మన అమాయకత్వాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ’ అంటూ సూర్యకిరణ్ కామెంట్ చేశారు. ’ మనం యూనీటిగా ఉండాలి లేదంటే వాళ్ళు గెలుస్తారు’ అంటూ మిగతా సభ్యులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా వాళ్ళ టాస్క్ కి మనం సపోర్ట్ చేస్తున్నట్లే ఉందంటూ జోర్ధార్ సుజాత అంది.

నిద్రకు ఉపక్రమించే ముందు కరాటే కళ్యాణి దేవితో గొడవకు దిగింది. ’ ముఖంపై తలుపు వేసినట్టు అలా లేచి వెళ్లిపోతావా? ’ అంటూ తనదైనా స్టైల్ లో అడగడంతో ’ నాకు నచ్చలేదు లేచి వచ్చేశా ’ అని దేవి స్పష్టం చేసింది. ’ నన్ను అర్థం చేసుకోవడం లేదు.. నేను నాలాగే ఉన్నాను’ అంటూ ఏడుస్తున్న కళ్యాణిని సూర్యకిరణ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. నైబర్ హౌస్ సభ్యుల ఎంట్రీ, వాదనలు, అలకలు, అఖిల్, కళ్యాణి కన్నీటీలో బిగ్ హౌన్ లో మూడురోజు పూర్తి అయ్యింది. ఏదీ టాస్కో.. ఏదీ సభ్యుల అసలు స్వభావమో తెలియక ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. అమ్మడు నెక్స్ట్ డూ అంటూ చిరు పాటలో బిగి హౌస్ సభ్యులంతా మార్నింగ్ డాన్స్ స్టేప్ లతో నాలుగో రోజుకు స్వాగతం పలికారు రాత్రి జరిగిన సన్నవేశాల్లో గంగవ్వ తప్ప అందరూ కనిపించారు. అయితే బిగ్ బాస్ ప్రారంభంలోనే గంగవ్వ కు రాత్రి ఎనిమిదింటీకే నిద్రపోయే అలవాటు ఉందని చెప్పింది. దాంతో ఆమె రాత్రి హౌస్ కనిపించలేదు. ఈ సీజన్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్లతో ఆమే పెద్దవయసు ఆమె కావడంతో జాగ్రత్తగా చూసుకోవాలని మిగతా సభ్యులకు నాగార్జున సీజన్ ప్రారంభంలోనే చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నాలుగ్గో రోజు ఉదయమే గంగవ్వ పై కెమరా ఫోకస్ అయ్యింది. గంగవ్వ డంబెల్స్  పట్టుకుని వర్క్ అవుట్స్ చేస్తుంటే ఆమెకు ఇతర సభ్యులు  గైడెన్స్ ఇచ్చారు. కెమెరాలకు ప్లయింగ్ కిస్ లు ఇస్తూ దుకుడు సినిమాలో బ్రహ్మనందం యాక్షన్ ను తలపించింది గంగవ్వ. అక్కడే ఉన్న ఫోన్ బాక్స్ ను చూస్తూ అరె ఇక్కడ ఫోన్ ఉంది అంటూ తనదైనా పక్క తెలంగాణ యాసలో గంగవ్వ అంటూ మిగతా సభ్యులను నవ్వించింది. అక్కడే ఉన్న లాస్య ఆమె మాటలకు నవ్వుతూ ’ హారికను ఎవ్వరైనా ఎత్తుకుపోయి నీ చీరలన్నీ ఇస్తే వదిలిపెడతాం అంటే ఇస్తావా ’ అని గంగవ్వను అడిగితే ’ నేనెందుకు ఇస్తా ’ అంటూ చెప్పడంతో హౌజ్ లో నవ్వులు. ’ సెంటూ కొట్టనా ’ అంటూ అక్కడివచ్చింది అరియానా.. ’ వద్దు నాకు ఏ సెంటు వద్దు పో ’ అంటూ చెప్పింది గంగవ్వ. ’ లిప్ స్టిక్ వేయానా.. నీ చీర రంగుకు మ్యాచ్ అయితది ’ అంటూ మరో ఆఫర్ ఇచ్చింది. ’ వద్దు.. నాకు ఏదీ వద్దు ’ అని గంగవ్వ అనగానే ’ హౌజ్ లో నుంచి వెళ్లేలోగా నీకు లిప్ స్టిక్ పెడతా’ అంటూ సరదాగా సవాల్ చేసింది అరియానా.
అలకలతో.. వాదావవాదాలతో.. గోరుముద్దల గోలతో ప్రారంభమై గంగవ్వ వర్క్ అవుట్స్, మేకప్, కెమెరాలకు ప్లయింగ్ కిస్ లతో బిగ్ బాగ్ నాలుగోరోజు ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎక్కువగా సోషల్ మీడియా నుంచే వచ్చిన వారు కావడంతో టెలివిజన్ ప్రేక్షకులకు వారిని గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంది. గంగవ్వ ఇంటి సభ్యులకు తనదైనా శైలీలో కితాబు ఇవ్వడాన్ని రేపటి ఎపిసోడ్ ప్రోమాగా చూపించారు. గురువారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ గంగవ్వ ఫన్ స్పెషల్ గా ఉంటుందేమో.. చూద్దాం.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.