![]() |
![]() |

ఇటీవల నిశ్చితార్ధం జరుపుకున్న నిహారిక కొణిదెల, ఓ సినిమా నుంచి బయటకు వచ్చేసింది. అది ఓ తమిళ చిత్రం. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన 'ఒరు నాళ్ల నాల్ పాధు సోల్రెన్' సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె, ఇటీవల హీరోయిన్‌గా నటించేందుకు ఓ చిత్రాన్ని అంగీకరించింది. అందులో అశోక్ సెల్వన్ హీరో. తాజా సమాచారం ప్రకారం నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ ఎంపికైంది. రజనీకాంత్ 'పేట'లో సిమ్రాన్ కూతురిగా నటించిన మేఘ తెలుగులో 'లై', 'చల్ మోహన్ రంగ' సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
తమ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు నిహారిక సంతకం చేసిందని ఆ చిత్ర దర్శకుడు తెలిపాడు. దాని కోసం నిహారిక టాంగో డాన్స్ కూడా నేర్చుకుంది. కానీ లాక్‌డౌన్‌తో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆగస్ట్‌లో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిశ్చితార్ధం చేసుకున్న నిహారిక, ఈ డిసెంబర్‌లో అతడిని పెళ్లాడనున్నది. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నందునే ఈ సినిమాను ఆమె వదులుకున్నట్లు సమాచారం. చూస్తుంటే.. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు పూర్తిగా మంగళం పాడేట్లే కనిపిస్తోంది.
![]() |
![]() |