![]() |
![]() |

సంక్రాంతి సినిమాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జనవరి 12న 'గుంటూరు కారం' (Guntur Kaaram), 'హనుమాన్' (Hanuman), జనవరి 13న 'సైంధవ్' (Saindhav), జనవరి 14న 'నా సామి రంగ' (Naa Saami Ranga) విడుదల కానున్నాయి. జనవరి 13న విడుదల కానున్న 'ఈగల్' వాయిదా పడింది. అయితే ఈ వాయిదా వెనుక సితార చేసిన త్యాగం కూడా ఉంది.
సంక్రాంతికి ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్య వస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు (Mahesh Babu) వంటి బిగ్ స్టార్ల సినిమాలకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. అందుకే తమతో పాటు సంక్రాంతిపై కర్చీఫ్ వేసిన మిగతా నాలుగు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా అయినా వాయిదా పడితే బాగుంటుందని 'గుంటూరు కారం' టీం భావించింది. అందుకు తగ్గట్టుగానే 'ఈగల్' (Eagle) టీం వాయిదాకి అంగీకరించింది. "బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి ఫిబ్రవరికి తీసుకొచ్చాడు. మారింది తేది మాత్రమే మాసోడి మార్క్ కాదు." అంటూ ఈగల్ ను నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈగల్ చేసిన త్యాగానికి తగ్గట్టుగా సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒక త్యాగం చేసింది.
.webp)
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'గుంటూరు కారం' చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఆ నిర్మాణ సంస్థకు చెందిన బ్యానర్ అనే విషయం తెలిసిందే. అందుకే 'ఈగల్' కోసం తమ సినిమా రిలీజ్ డేట్ ని సితార త్యాగం చేసింది. సితార నిర్మిస్తున్న 'టిల్లు స్క్వేర్' ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ తేదీని ఈగల్ కోసం త్యాగం చేయడానికి అంగీకరించింది సితార. దీంతో 'ఈగల్' ఫిబ్రవరి 9న విడుదల కానుంది. 'టిల్లు స్క్వేర్' మరో కొత్త తేదీకి రానుంది.
![]() |
![]() |