Home  »  News  »  Shruti Haasan: శృతి హాసన్ తన ఐడెంటిటీ కోల్పోతుందా!

Updated : Jul 2, 2026

 


శృతి హాసన్(Shruti Haasan)తన ప్రీవియస్ మూవీ 'పెద్ది'లో  'హల్లల్లా' సాంగ్ తో చరణ్ తో పాటు మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శృతి హాసన్ కి ఉన్న గోల్డెన్ లెగ్ టాగ్ మరో సారి రుజువయ్యింది. కొన్ని రోజుల నుంచి  సోషల్ మీడియా వేదికగా   టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

 శృతి హాసన్ తాను ఎంచుకుంటున్న ప్రాజెక్టులలో ఆమె కంటే పక్కన ఉండే నటీమణులకే ఎక్కువ క్రెడిట్, గుర్తింపు దక్కుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తాజా ఉదాహరణ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కూలీ'. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అధికారికంగా శృతి హాసన్ హీరోయిన్ అయినప్పటికీ, సినిమాలోని ఒకే ఒక్క ఐటమ్ సాంగ్ ద్వారా క్రెడిట్ మొత్తం పూజా హెగ్డే కొట్టేసింది. 'మెనికా బెలూచి' అంటూ సాగే ఆ మూడు నిమిషాల స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే వేసిన స్టెప్పులు, చూపించిన గ్లామర్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనివల్ల సోషల్ మీడియా మరియు మీడియా ప్రచారంలో శృతి హాసన్ కంటే పూజా హెగ్డే పేరు ఎక్కువగా మార్మోగిపోయింది. పెద్దిలో కూడా జాన్వీ కపూర్ క్యారక్టర్ పై విమర్శలు రావడంతో తన పేరు పెద్దగా వినపడలేదు. అడివి శేషు డెకాయిట్ మూవీలో ముందుగా శృతి హాసన్ ని తీసుకొని ఆ తర్వాత డ్రాప్ అయ్యారు. 

Also read: Ram Charan: నాకు ఆ ప్లాప్ హీరోయిన్ కావాలి!..చరణ్ అప్ కమింగ్ మూవీ కీలక అప్ డేట్ 

తన కెరీర్ ప్రారంభంలో 'ఐరన్ లెగ్' అనే ఘోరమైన విమర్శలను ఎదుర్కొని, ఆ తర్వాత వరుస హిట్లతో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ నటీమణుల జాబితాలోకి చేరిన శృతి హాసన్ జీవితం మొదటి నుండి ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. కమల్ హాసన్, సారిక విడిపోయినప్పుడు శృతి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. చెన్నైలోని లగ్జరీ బెంజ్ కార్ల జీవితం నుండి ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణించే సాధారణ స్థాయికి పడిపోయింది. 2018 ఆ సమయంలో తీవ్రమైన యాంగ్జైటీ (ఆందోళన) ఎదుర్కొని సినిమాలకు తాత్కాలిక విరామం కూడా ఇచ్చింది. ఇలాంటి ఎన్నో వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి నిలబడిన ఈ స్టార్ బ్యూటీ, ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం 'సలార్ 2' పై ఆశలు పెట్టుకుంది. అయితే, ఈ ప్రస్తుత ఐడెంటిటీ క్రైసిస్ నుండి శృతి ఎలా బయటపడి, తన పూర్వ వైభవాన్ని ఎలా చాటుకుంటుందో వేచి చూడాలి. 'ఆకాశంలో ఒక తార' తన అప్ కమింగ్ మూవీ. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.