Home  »  News  »  OTTలో ఈ 5 సినిమాలు అసలు మిస్ అవ్వకండి! 

Updated : Jul 2, 2026

ప్రతి వారం వందలాది సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతుంటాయి. అయితే అందులో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఐదు సినిమాలను, సిరీస్ లను మీ ముందుకు తీసుకొచ్చాము. ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా, కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా చూడదగ్గ రీసెంట్ బెస్ట్ కంటెంట్ ఇది.

నెంబర్ 5... ది షీప్ డిటెక్టివ్స్ (The Sheep Detectives)
ఒక గొర్రెల కాపరి, తన గొర్రెలకి రోజు డిటెక్టివ్ కథలు చదివి వినిపిస్తూ ఉంటాడు. కానీ, ఒకరోజు అతను అనుమానాస్పదంగా చనిపోతాడు. ఆ మర్డర్ మిస్టరీని బయటపెట్టడానికి.. ఆ గొర్రెలే రంగంలోకి దిగుతాయి. తమ ఓనర్ ని చంపిన హంతకుడిని కనిపెట్టడానికి ఆ గొర్రెలు చేసే ఇన్వెస్టిగేషన్ చూస్తే మైండ్ పోతుంది. వినడానికి ఫన్నీగా ఉన్నా, సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ సస్పెన్స్ కి మనం కనెక్ట్ అయిపోతాం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.

నెంబర్ 4... హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (Husbands in Action)
ఫుల్ ఆన్ యాక్షన్, కామెడీ అండ్ ఎమోషన్స్ ఉన్న పర్ఫెక్ట్ ఫన్ రైడ్ ఇది. కిడ్నాప్ అయి డేంజర్ లో ఉన్న వైఫ్ ని, కూతురిని కాపాడటానికి.. ఒకరంటే ఒకరికి అస్సలు పడని ఎక్స్-హస్బెండ్, ప్రజెంట్ హస్బెండ్ కలిసి ఒక రిస్క్ మిషన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఈగో క్లాషెస్ తో ఫస్ట్ హాఫ్ అంతా నవ్వులే నవ్వులు. సెకండ్ హాఫ్ లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో కూడా ఉంది. మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో చూసేయండి.

నెంబర్ 3... ఐ విల్ ఫైండ్ యు (I Will Find You)
అవతార్ హీరో సామ్ వర్తింగ్టన్ (Sam Worthington) లీడ్ రోల్ చేసిన ఒక సాలిడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. తన సొంత కొడుకునే చంపాడనే నేరంతో ఒక తండ్రి జైల్లో ఉంటాడు. కానీ ఐదేళ్ల తర్వాత... చనిపోయాడనుకున్న కొడుకులాగే ఉన్న ఒక అబ్బాయి ఫోటో అతని చేతికి వస్తుంది. అసలు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? కొడుకు బతికే ఉన్నాడా? జైల్లో ఉన్న హీరో ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్లు, ఆ ఫాదర్ ఎమోషన్ కట్టిపడేస్తాయి . నెట్‌ఫ్లిక్స్ లో 8 ఎపిసోడ్స్ తో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది.

నెంబర్ 2... అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash) 
ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ అంతా ఎదురుచూసిన విజువల్ వండర్ ఇది. జేమ్స్ కెమెరాన్ ఇందులో.. పండోరా గ్రహం మీద ఉండే ఫైర్ ట్రైబ్ కి, వాటర్ ట్రైబ్ కి మధ్య జరిగే ఎపిక్ వార్ ని చూపించారు. మనుషుల నుండి పండోరాని, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి జేక్ సల్లీ చేసే పోరాటం.. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే లాస్ట్ 40 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ కి గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఆ విజువల్స్ చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఒక చిన్న లిప్ కిస్ సీన్ తప్ప ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. జియోహాట్‌స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది.

ఇక ఫైనల్ గా నెంబర్ 1... బ్లాస్ట్ జోన్ (Blast Zone)
యాక్షన్ మూవీ లవర్స్ కి ఇదొక పర్ఫెక్ట్ ఫీస్ట్. కొంతమంది పొలిటీషియన్స్, కార్పొరేట్ విలన్స్ కలిసి ఒక పెద్ద స్కామ్ చేయడానికి ప్లాన్ చేస్తే... ఆ గొడవలో ఒక సామాన్య ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. తమ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఏం చేసింది? అనేది మెయిన్ స్టోరీ. యాక్షన్ కింగ్ అర్జున్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే లేడీస్ ఫైట్ సీక్వెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. 'దృశ్యం', 'ఖైదీ' సినిమాలను మిక్స్ చేస్తే వచ్చే కిక్ ఈ సినిమాలో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ యాక్షన్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి.

వీటితో పాటు.. ఈ వారం కూడా ఓటీటీలోకి అదిరిపోయే కంటెంట్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సిరీస్, నెట్‌ఫ్లిక్స్ లో 'సూపర్ సుబ్బు' సిరీస్, ఈటీవీ విన్ లో 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ తో పాటు.. సన్ నెక్స్ట్ లో 'హ్యాంగ్‌మ్యాన్' మూవీ ఎంట్రీ ఇచ్చాయి. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.