Home  »  News  »  Ram Charan: నాకు ఆ ప్లాప్ హీరోయిన్ కావాలి!..చరణ్ అప్ కమింగ్ మూవీ కీలక అప్ డేట్ 

Updated : Jul 2, 2026

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీని చాటి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అభిమానులు, మూవీ లవర్స్  కళ్లు  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ 17 వ చిత్రంపై పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన  'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాదాపు  200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమా తర్వాత, మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో rc 17 పై  అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తన 'పుష్ప' సిరీస్ తరహాలోనే ఈ చిత్రంలోనూ హీరోయిన్ పాత్రను చాలా పవర్‌ఫుల్గా, రా కంటెంట్‌తో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్‌కు కియారా అయితేనే గ్లామర్ పరంగా, నటన పరంగా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చిత్ర బృందం గట్టిగా భావిస్తోందట. మరి అదే నిజమైతే  చరణ్‌తో కియారా అద్వానీ చేస్తున్న మూడవ సినిమా ఇదే అవుతుంది.

అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి మెగా అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తు. సోషల్ మీడియా వేదికగా వారు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. చరణ్, కియారా జోడీ గతంలో నటించిన 'వినయ విధేయ రామ', అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఈ కాంబినేషన్‌పై ఒక రకమైన నెగటివ్ సెంటిమెంట్, ఐరన్ లెగ్ ముద్ర పడిపోయాయి. ఒకే హీరోతో వరుసగా 2 ఫ్లాప్స్ ఉన్న హీరోయిన్‌ను, ఇంతటి ప్రతిష్టాత్మకమైన సుకుమార్ సినిమాలో అనుకోవడం  ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చరణ్‌కు కియారా కాకుండా ఇంకెవరైనా లక్కీ హీరోయిన్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.


Also read: Vijay: జననాయగన్ కి షాక్ ఇచ్చిన సెన్సార్.. థియేటర్ లోపలకి వాళ్ళు నో ఎంట్రీ! 

మరోవైపు సుకుమార్ మాత్రం ఇలాంటి సెంటిమెంట్లను అస్సలు నమ్మరని, కథకు ఎవరు సరిపోతారో వారినే తీసుకుంటారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత, 'పుష్ప'లో శ్రీవల్లిగా రష్మిక మందన్న క్యారక్టర్ లని  సుకుమార్ తీర్చిదిద్దిన విధానం చూస్తే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే RC17లో కూడా హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, సుకుమార్ నమ్మకాన్ని కియారా నిలబెడుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ రేసులో కన్నడ నటి రుక్మిణి వసంత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి ఫ్యాన్స్ సెంటిమెంట్‌ను గౌరవించి వేరే హీరోయిన్‌ను తీసుకుంటారా, లేక రామ్ చరణ్ మరియు సుకుమార్ తమ నమ్మకమే నిజం చేస్తూ కియారా అద్వానీని ఫైనల్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.