![]() |
![]() |

అక్కినేని కాంపౌండ్ కథానాయకులంతా `ప్రత్యేక` మంత్రం పఠించే పనిలో ఉన్నారా? అవుననే చెప్పకతప్పదు ప్రస్తుతం ఆ కుటుంబంలోని హీరోల తీరు చూస్తుంటే..
కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. గతకొంతకాలంగా అక్కినేని కాంపౌండ్ కి చెందిన కథానాయకులు వేరే ఫ్యామిలీ లేదా వేరే భాషకు చెందిన అగ్ర కథానాయకుల చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిరుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం కోసం అక్కినేని కాంపౌండ్ కి చెందిన యంగ్ హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కాకపోతే, ఈ ఇద్దరు కూడా బాలీవుడ్ బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో అలా సందడి చేయనున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `బ్రహ్మాస్త్ర`లో నాగ్ స్పెషల్ రోల్ లో కనిపించనుండగా.. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ `లాల్ సింగ్ చద్ధా`లో చైతూ ఆర్మీ ఆఫీసర్ గా ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నాడు.
ఈ క్రమంలోనే... త్వరలో మరో అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్.. మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ చిత్రంలో స్పెషల్ రోల్ చేయబోతున్నారట. హను రాఘవపూడి రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కోసం సుమంత్ ఇలా ప్రత్యేక పాత్రలో మెరుస్తారని టాక్.
నాగ్, చైతూ, సుశాంత్, సుమంత్ కి ప్రత్యేక పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారి కాకపోయినా.. తక్కువ గ్యాప్ లోనే ఇలా వరుసగా సందడి చేయనుండడం వార్తల్లో నిలుస్తోంది.
![]() |
![]() |