![]() |
![]() |

ఆనంద్ దేవరకొండ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హైవే' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'హైవే' చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
'చుట్టాలబ్బాయి' సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్ తలారి.. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా 'హైవే' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అంటూ పాపులర్ అయిన మళయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ సినిమాతో మానస రాధాకృష్ణన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని మానస కొట్టేసింది. ఎట్టకేలకు ఆమె టాలీవుడ్ ఎంట్రీ 'హైవే' చిత్రంతో ఇవ్వబోతోంది.
షూటింగ్ ప్రారంభం సందర్భంగా దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. "నేను దర్శకత్వం వహిస్తోన్న మూడో చిత్రమిది. హైవే నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. టెక్నికల్ గా చాలా అడ్వాన్స్‌డ్ గా ఉండబోతుంది." అని అన్నారు. ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |