![]() |
![]() |

మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆ చిత్రం కంటే ముందు అటు ప్రభాస్, ఇటు కృతి సనన్ ఒకే రోజున తమ తమ చిత్రాలతో బరిలోకి దిగుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ సాగా `సలార్` 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా.. హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కట్ చేస్తే.. అదే రోజున కృతి సనన్ నటించిన హిందీ చిత్రం `భేడియా` కూడా విడుదల కానుంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకుడు. తాజాగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.
మరి.. ఒకే రోజున బరిలోకి దిగుతున్న ఈ చిత్రాలతో ప్రభాస్, కృతి సనన్ ఎలాంటి ఫలితాలు అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |