![]() |
![]() |

మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్ కు ముందుగా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన ప్రసాద్ మూరెళ్లను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. పవన్ నటించిన 'అత్తారింటికి దారేది', 'కాటమరాయుడు' సినిమాలకు సైతం ఆయన పని చేశారు. 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ తో ముచ్చటగా మూడోసారి పవన్ తో పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది. అయితే కారణం ఏంటో తెలీదు గాని.. ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రసాద్ మూరెళ్ల స్థానంలో రవి కె చంద్రన్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నట్లు సమాచారం. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలకు పని చేసిన రవిచంద్రన్.. 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రెండో సినిమాగా పవన్ ప్రాజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |