![]() |
![]() |

విన్నీ ఇటీవల బుల్లి తెరపై బాగా కనిపిస్తూ, వినిపిస్తున్న పేరు. ఈ విన్నీ ఎవరో కాదు శేఖర్ మాస్టర్ అబ్బాయి. ఆల్రెడీ శేఖర్ మాస్టర్ గురుంచి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో మూవీస్ కి కోరియోగ్రఫీ చేస్తూ ఒక లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి విన్నీ కూడా స్టేజి షోస్ మీద డాన్స్ ఇరగదీసేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ విన్నీ బిగ్ స్క్రీన్ మీద కనిపించాడు.
'అంటే సుందరానికీ!' మూవీ లో నాని చిన్నప్పటి సుందర్ కేరెక్టర్ లో కనిపించి అలరించాడు. డాన్స్ తో పాటు యాక్టింగ్ కూడా షురూ చేసేసాడు విన్నీ. ఈ మూవీ రిలీజై పర్వాలేదనిపించింది. ఇప్పుడు సుందర్ పాత్రలో నటించిన విన్నీకి నెటిజన్స్ కంగ్రాట్స్ వర్షం కురిపిస్తున్నారు. 'విన్నీకి దిష్టి తియ్యండి. మంచిగా యాక్ట్ చేసాడు , డాన్స్ చేసాడు. విన్నీ అప్పుడే అంత పెద్దవాడయ్యాడు , నైస్, సూపర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |