Home

»

Latest News

ఎంగేజ్మెంట్ చేసుకున్న 'కేరింత' ఫేమ్ సుకృతి అంబటి

Jun 11, 2022 4:42PM


కేరింత మూవీలో నటించిన సుకృతికి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది.  సుకృతి అంబటి అంటే తెలియకపోవచ్చు కానీ 'కేరింత'  మూవీలో నటించిన భావన అంటే ఎవ్వరికైనా గుర్తొచ్చేస్తుంది. ఢిల్లీ లోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో సుకృతి చదువుకుంది. రాజస్థాన్లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసింది.

ఐతే సుకృతికి ఐదేళ్ల క్రితం తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తండ్రే తనకు అండగా నిలబడి అమ్మ ప్రేమను పంచారు. అమ్మ లేని లోటు తీర్చారు. అమ్మను గుర్తురాకుండా చేశారు. 'మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇంత మంచి నాన్న దొరకడం నా అదృష్టం' అంటూ తన తండ్రి గురించి చెప్తూ తన  ఎంగేజ్మెంట్ పిక్స్ ని  కూడా షేర్ చేసుకుంది. ఇక  కాబోయే భర్త అక్షయ్ సింగ్ తన సూర్యుడు, చంద్రుడు , ఆకాశంలో మెరిసే తారలాంటి వాడు అంటూ తన మనసులోని ప్రేమను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేసుకుంది. నెటిజన్స్ కూడా ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com