![]() |
![]() |

నేచురల్ స్టార్ నానికి క్రిస్మస్ సీజన్ భలేగా అచ్చొచ్చింది. 2017లో `మిడిల్ క్లాస్ అబ్బాయ్` (ఎంసీఏ)తోనూ, 2021లో `శ్యామ్ సింగ రాయ్`తోనూ ఆ సీజన్ లో సందడి చేసిన నానికి.. ఆయా చిత్రాలు మంచి ఫలితాలను అందించాయి. కట్ చేస్తే.. త్వరలో ఇదే సీజన్ లో మరో సినిమాతో పలకరించేందుకు నేచురల్ స్టార్ సిద్ధమవుతున్నాడని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్ లో `దసరా` పేరుతో నాని ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `నేను లోకల్` (2017) తరువాత నానికి జోడీగా కేరళకుట్టి కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ సినిమా.. సింగరేణి గనుల నేపథ్యంలో రూపొందుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే, క్రిస్మస్ సీజన్ లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత జంటగా నటిస్తున్న `ఖుషి` విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే ఆ ఫిలిం మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ శివ నిర్వాణ డైరెక్టోరియల్ ఎంటర్టైన్ చేయనుంది. మరి.. `ఎవడే సుబ్రమణ్యం` (2015) కో- స్టార్స్ నాని, విజయ్.. ఈ బాక్సాఫీస్ క్లాష్ లో ఎలాంటి ఫలితాలను పొందుతారో చూడాలి.
![]() |
![]() |