![]() |
![]() |

వైవిద్యానికి అగ్ర తాంబూలమిచ్చే యువ కథానాయకుల్లో నిఖిల్ ఒకరు. `హ్యాపీ డేస్`(2007), `యువత`(2008), `స్వామి రా రా`(2013), `కార్తికేయ`(2014), `ఎక్కడికి పోతావు చిన్నవాడా`(2016), `అర్జున్ సురవరం` (2019) వంటి విజయవంతమైన చిత్రాలతో ఈతరం ప్రేక్షకులకు చేరువైన నిఖిల్.. చివరిసారిగా వెండితెరపై సందడి చేసి రెండున్నరేళ్ళు దాటింది. `అర్జున్ సురవరం` తరువాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించని నిఖిల్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తక్కువ గ్యాప్ లోనే మూడు సినిమాలతో పలకరించబోతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `కార్తికేయ`కి సీక్వెల్ గా ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లోనే రూపొందుతున్న మూవీ `కార్తికేయ 2`. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ .. జూలై 22న జనం ముందుకు రానుంది. అలాగే, అనుపమతోనే నిఖిల్ మరోసారి జట్టుకట్టిన `18 పేజేస్` సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇక గ్యారీ బీహెచ్ డైరెక్షన్ లో తయారవుతున్న స్పై థ్రిల్లర్ `స్పై` దసరా సీజన్ లో వినోదాలు పంచనుంది. మరి.. `కార్తికేయ 2`, `18 పేజెస్`, `స్పై` - ఇలా 2022 సెకండాఫ్ లో తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ డిఫరెంట్ జానర్ మూవీస్ తో నిఖిల్ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
![]() |
![]() |