![]() |
![]() |

`మహానటి`(2018)తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంది కేరళకుట్టి కీర్తి సురేశ్. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలు కాదు కదా.. కనీసం సక్సెస్ అనే పదానికే నోచుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఆమె గత చిత్రం `అణ్ణాత్త` (తెలుగులో `పెద్దన్న`) సైతం తీవ్ర నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రాలపైనే తన ఆశలు పెట్టుకుంది కీర్తి.
విశేషమేమిటంటే.. ఆమె తాజా చిత్రాలు రెండు వరుస వారాల్లో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. `మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సి`, `గుడ్ లక్ సఖి`. విభిన్న భాషల్లో విభిన్న నేపథ్యాలతో ఈ సినిమాలు తెరకెక్కడం విశేషం. ప్రధానంగా మలయాళంలో తెరకెక్కిన `మరక్కర్`లో మోహన్ లాల్ టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. ఓ కీలక పాత్రలో కీర్తి ఎంటర్టైన్ చేయనుంది. డిసెంబర్ 2న మలయాళంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక `మరక్కర్` విడుదలైన వారం తరువాత అంటే డిసెంబర్ 10న కీర్తి టైటిల్ రోల్ లో నటించిన స్పోర్ట్స్ డ్రామా `గుడ్ లక్ సఖి` విడుదల కానుంది. ఇందులో కీర్తి ఓ షూటర్ గా కనిపించనుంది. మరి.. వారం వ్యవధిలో రానున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తోనైనా కీర్తి హిట్స్ కొడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కీర్తి చేతిలో `సర్కారు వారి పాట`, `భోళా శంకర్` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఉన్నాయి. 2022లో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కానున్నాయి.
![]() |
![]() |