![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. 'విశ్వంభర' వేసవిలో విడుదల కానుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడు ఏకంగా ఆగస్టుకి వాయిదా పడిందని తెలుస్తోంది.
చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ కావడంతో 'విశ్వంభర'పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు తగ్గ స్థాయిలో టీజర్ లో విజువల్స్ లేవనే కామెంట్స్ వినిపించాయి. దీంతో టీం తగినంత సమయం తీసుకొని, గ్రాఫిక్స్ పై మరింత శ్రద్ధగా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే 'విశ్వంభర' అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం కానుందట. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా.. ఆలస్యంగా వచ్చినా అదిరిపోయే కంటెంట్ తో రావాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |