![]() |
![]() |

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఆయన తెరకెక్కించే సినిమాలు ప్రపంచ సినిమాలుగా సిల్వర్ స్క్రీన్ మీద తన సత్తాని చాటుతున్నాయి. ఆయన వల్ల తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు ని కూడా దక్కించుకుంది.తాజాగా దర్శకధీరుడికి సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా నిలిచింది.
కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఉన్న అమృతేశ్వర ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.ఆ ప్రాంగణంలో నూతనంగా శివలింగాన్ని ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ట గావించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యాడు.పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలని ధరించిన ఆయన ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్నాడు. రాజమౌళి వెంట ఆయన సతీమణి రమ కూడా పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి తాజాగా మహేష్ బాబు తో తన కొత్త సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మూవీ ఓపెనింగ్ కి వస్తున్నాడని అంటున్నారు. అలాగే ఇండోషియన్ నటి చెల్సియా ఎలిజబెత్ తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్ వర్త్ లు నటిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. మహేష్ తో సినిమా ప్రారంభం అయ్యే నేపథ్యంలో రాజమౌళి టెంపుల్ న్యూస్ వైరల్ గా మారింది..
![]() |
![]() |