![]() |
![]() |

`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు` వంటి వరుస విజయాల తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `ఎఫ్ 3`. `ఎఫ్ 2` ఫ్రాంచైజీలో రెండో సినిమాగా రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. ఈ నెల 27న జనం ముందుకు రానుంది. `ఎఫ్ 2`లో నటించిన విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ఇందులోనూ సందడి చేయనున్నారు. సునీల్, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది.
ఇదిలా ఉంటే, `ఎఫ్ 3` రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా.. 2 గంటల 28 నిమిషాల నిడివితో ఎంటర్టైన్ చేయనుంది. 2 గంటల 30 నిమిషాల ఫన్ రైడ్ గా అలరించిన `ఎఫ్ 2`తో పోలిస్తే.. 2 నిమిషాల తక్కువ డ్యూరేషన్ తోనే `ఎఫ్ 3` రాబోతోంది. మరి.. ఈ క్రిస్పీ రన్ టైమ్ `ఎఫ్ 3`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై `దిల్` రాజు నిర్మించిన `ఎఫ్ 3`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.
![]() |
![]() |