![]() |
![]() |

'NTR 30' అప్డేట్ తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. తమ హీరోని పక్కా మాస్ సినిమాలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కి కేవలం ఒక మోషన్ పోస్టర్ తోనే ఫుల్ కిక్ వచ్చేలా చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పుడు 'NTR 31' టైమ్ వచ్చింది. కేవలం ఒక్క పోస్టర్ తోనే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
తారక్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు(మే 20) తారక్ పుట్టిన రోజు కావడంతో 'NTR 31' పోస్టర్ ని విడుదల చేశారు. అందులో తారక్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిసితున్నాడు. తారక్ గుబురు గడ్డం, మీసాలతో ఇంటెన్స్ లుక్ తో చూస్తున్న పోస్టర్ లో ప్రశాంత్ నీల్ మార్క్ కనిపిస్తోంది. "నెత్తుటితో తడిచిన నేల మాత్రమే గుర్తుండిపోతుంది" అంటూ పోస్టర్ ని షేర్ చేసిన ప్రశాంత్ నీల్ "అతని నేల.. అతని పాలన.. కానీ నెత్తురు మాత్రం అతనిది కాదు" అని రాసుకొచ్చి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాడు.

ఇటీవల 'కేజీఎఫ్-2'తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. 2023 ఏప్రిల్ నుంచి 'NTR 31' స్టార్ట్ కానుంది. 'ఆర్ఆర్ఆర్'తో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడమే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్(NTR30, NTR31) తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తారక్ కి మాస్ హీరోగా సౌత్ లో మంచి గుర్తింపు ఉంది. ఆర్ఆర్ఆర్ తో నార్త్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. పైగా ఇప్పుడు నార్త్ లో మాస్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తారక్ వరుసగా పాన్ ఇండియా స్థాయి యాక్షన్ సినిమాలు చేస్తుండటం విశేషం.
![]() |
![]() |