![]() |
![]() |

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విక్రమ్'. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా సూర్య గెస్ట్ రోల్ లో మెరవనున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకే సినిమాలో ఇంతమంది స్టార్స్ ని చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ దక్కించుకోవడం విశేషం.
నితిన్ కుటుంబానికి శ్రేష్ఠ్ మూవీస్ అనే బ్యానర్ ఉంది. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఎప్పటినుంచో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాడు. నితిన్ కూడా ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు ప్రొడ్యూసర్ గానూ సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు 'విక్రమ్' మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని భారీ ధరకు దక్కించుకొని.. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా విడుడల చేస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించాడు.
ఇటీవల కన్నడ యాక్షన్ మూవీ 'కేజీఎఫ్-2' తెలుగులో భారీ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ క్రేజీ మూవీ విక్రమ్ రైట్స్ నితిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్, సూర్య లకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. 'ఉప్పెన'తో విజయ్ సేతుపతి, 'పుష్ప'తో ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. డైరెక్టర్ లోకేష్ గత చిత్రాలు 'ఖైదీ', 'మాస్టర్' మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ గా నిలిచాయి. ఇన్ని సానుకూల అంశాలతో విడుదలవుతున్న విక్రమ్ తెలుగులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |