![]() |

ఒక హీరో చేయాల్సిన కథతో మరో హీరో సినిమా చేయడమనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. నిజానికి 'పుష్ప' కథని మొదట సుకుమార్ మహేష్ బాబుకి చెప్పాడని.. ఆ పాత్ర తనకి సూట్ కాదని మహేష్ నో చెప్పడంతో అల్లు అర్జున్ తో చేశాడని టాక్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేయాల్సిన ఓ కథని జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడంటూ ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
2020 జూలైలో తన 21వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్లుగా బన్నీ ప్రకటించాడు. అలాగే తారక్ తన 30 సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల 'NTR30' ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ స్థానంలో కొరటాల వచ్చాడు. అలాగే బన్నీతో కొరటాల చేయాల్సిన 'AA21'కి బ్రేక్ పడింది.
తారక్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా 'NTR30' కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ 'AA21' పోస్టర్ ను పోలి ఉంది. దీంతో కొరటాల అప్పుడు బన్నీతో అనుకున్న కథతోనే ఇప్పుడు తారక్ తో చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. అదే నిజమైతే మహేష్ చేయాల్సిన కథతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టినట్లు.. బన్నీ చేయాల్సిన కథతో తారక్ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం 'NTR30' మోషన్ పోస్టర్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ హీరో నుంచి చాలా కాలం తర్వాత పర్ఫెక్ట్ మాస్ మూవీ వస్తుందని ఆనందపడుతున్నారు.
![]() |